Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మధిర
మధిర వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కోర్స్ చదువుతున్న విద్యార్థులు మంగళవారం క్షేత్ర సందర్శన చేశారు. వ్యవసాయ యాజమాన్య భాగస్వామ్య అధ్యయనంలో భాగంగా మండల పరిధిలోని మాటూరు, మాటూరు పేట గ్రామంలో రైతులు పండిస్తున్న వరి, ప్రతి, మిరప తదితర పంటలను పరిశీలించి రైతుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణి దేవి క్షేత్ర స్థాయిలో పంటల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ జి వేణుగోపాల్, కె నాగస్వాతి, ఏవో పరేష్ కుమార్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.