Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలపై దాడిచేసి, వాటిని కూల్చడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంచికంటి భవన్లో ''మతోన్మాదం-ఆర్ధిక పరిస్థితులు-సీపీఐ(ఎం) వైఖరి'' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్య వక్తగా హాజరైన వీరయ్య మాట్లాడారు. బీజేపీ కమ్యూనిస్టు పాలిత ప్రాంతాలను విచ్చిన్నం చేయాలని చూసిందని, ఇప్పుడు తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేసిందని విమర్శించారు. దేశంలో బీజేపీ విధానాలు ప్రమాదకరంగా మారాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యంగ మౌళిక స్వభావాన్ని మార్చేస్తున్నారన్నారు. బీజేపీ గుజారత్ పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో వ్యవహరిస్తుందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలనే కుట్రలతో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. రాజ్యంగా బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాల హక్కులపై గవర్నర్లు దాడి చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితులు, మైనార్టీలపై, కమ్యూనిస్టులపై దాడులు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనీయర్ నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వెంక టేశ్వర్లు, యం.జ్యోతి, లక్కి బాలరా జు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, రేపాకుల శ్రీను, దొడ్డా రవి, వీర్ల రమేష్, కొండబోయిన వెంకటేశ్వర్లు, భూక్య రమేష్, నరేష్, యు.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.