Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పివి కాలనీ ఏరియా సంతకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని మణుగూరు ఏరియా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకరరావు అన్నారు. మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పీవీ కాలనీ ఏరియాలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కమ్యూనిటీ హాల్ నందు కార్మిక బంధువుల సౌకర్యార్థం మరో రెండు రూములను అదనంగా పెంచాలని కోరారు. కాలనీ ఏరియాలో ఉన్న అంతర్గత రోడ్లను మెరుగు పరచాలని తెలిపారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన జీఎం వెంకటేశ్వరరెడ్డి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రవుఫ్, వీర భద్రయ్య, కాపా శివాజీ, సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, ఏస్వియస్ఎన్ వర్మ, కృష్ణ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.