Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డగూడెం అటవీశాఖ బీట్లో పోడు రైతులపై దౌర్జన్యానికి పాల్పడిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆదివాసి గిరిజనులకు మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1996 నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూమిపై ఫారెస్ట్ అధికారులు దౌర్జనంగా భూములు లాక్కోవటం అన్యాయమని అన్నారు. గిరిజనులకు అన్ని రకాల హక్కులు 1/70 చట్టం ఉండి 2006లో గిరిజనుల హక్కు చట్టం వచ్చిన గిరిజనులు బలి పశువులు అవుతున్నారని ఆయన అన్నారు. వెంటనే భూములపై సర్వే చేసి పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకోవాలన్నారు. జరిగిన సంఘటనపై తహశీల్దార్ భగవాన్ రెడ్డికి ఫారెస్ట్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజనులు కోరారు. అదేవి ధంగా మహిళల పైన దాడి చేసిన ఫారెస్ట్ అధికారుల పైన కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు ఊకే రవి, మిడియం పుల్లయ్య, మిడియం శ్రీను, కృష్ణ, వీరభద్రం, సీతమ్మ, నాగమణి, రాజు, కనితి అర్జున్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.