Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పదును పడదామని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం గుండాల మండల కేంద్రములో ప్రజాపంథా కొత్తగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్డీఎల్సీ కార్యదర్శి ఈసం శంకర్ అధ్యక్షతన అమర వీరుల భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సభలో అరుణోదయ కళాకారులు అమరవీరుల పాటలు, కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయల చంద్ర శేఖర్, కేచ్చల రంగారెడ్డి, పాయం చిన్న చంద్రన్న, చండ్ర అరుణ, జిల్లా, డివిజన్, మండల నాయకులు జాటోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రముతో పాటు కాచనపల్లి, రోళ్లగడ్డ, నడిమిగూడెం, కడవటంచ గ్రామాల్లో అమరవీరుల వర్ధంతిని పురస్కరించుకుని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కొమరం సీతారాములు, పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్, పర్శక రవి, వై.వెంకన్న, పూనెం రంగన్న, షేక్ అజ్గర్, గడ్డం లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : అమరవీరుల ఆశయ సాధనకై పోరాడాలని న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బస్టాండ్ సెంటర్లో గల పగడాల వెంకన్న స్థూపం, కరెంట్ ఆఫీస్ ఏరియాలో బర్రా వీరస్వామి స్థూపం, సీఎస్పీ బస్తీలోని దండు మైసయ్య స్మారక స్తూపాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేసి వర్ధంతులు జరిపారు. నాయకులు తోడేటి నాగేశ్వరరావు, గోపాలరావు, నరసింహారావు, డి.మోహన్ రావు, రాజు, మాంగ్యా తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం : నాటి ఖమ్మం జిల్లాలో విప్లవ పార్టీ నిర్మాణానికి బత్తుల వెంకటేశ్వరరావు ఎనలేని కృషి చేశాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి పిలుపునిచ్చారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం అశ్వాపురం మండల కేంద్రంలో బత్తుల వెంకటేశ్వరరావు స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏఐకెఎమ్ఎస్ జిల్లా నాయకులు బండ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో మోరా రవి మాట్లాడారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కుంజా కృష్ణ, లాలయ్య పాల్గొన్నారు.