Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకయ్య
నవతెలంగాణ-చండ్రుగొండ
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండ్రుగొండలోని లక్షగార్డెన్ అయ్యన్నపాలెంలో వ్యకాస 6వ మండల మహాసభ సంఘం నాయకులు పెద్దిన్ని వేణు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో కనకయ్య మాట్లాడారు. వ్యవసాయ కార్మికులు పెరిగిన అధిక ధరలతో జీవించలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. భూమి, ఇళ్ల స్థలాలు ఇండ్లు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని రానున్న కాలంలో ఈ సమస్యలపై సమరశీల పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటాల్లో వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు పరిష్క రించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో వ్యకాస జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి, యాసా నరేష్, రైతు సంఘం మండల కార్యదర్శి అవులూరి రామిరెడ్డి, గుర్రం గూడెం పంచా యతీ సర్పంచ్ కాకా సీత సీఐటియూ మండల కన్వీనర్ రామడుగు వెంక టాచారి, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు కెవిపిఎస్ మండల అధ్యక్షుడు మిరి యాల మోహన్ రావు, ఎస్కె.నాగుల్ మీరా, అబ్దుల్ రెహమాన్, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.
నూతన కమిటీ
మహాసభలో నూతన కమిటీని ఎన్ను కున్నారు. మండల అధ్యక్ష కార్యదర్శులుగా తూరు పాక శ్రీను, పెద్దిన్ని వేణు ఎన్నికయ్యారు. ఉపా ధ్యక్షులుగా ఉప్పతల గోపాల్, సహాయ కార్య దర్శిగా చింతల సరస్వతి, సభ్యులుగా పద్దం లక్ష్మి, కాకా కృష్ణయ్య, చాపలమడుగు వినోద్, కొండ్రు సెల్వ రాజ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.