Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ ఉపాధి పథకాలను తీసుకెళ్లడంలో యువకులు కీలకపాత్ర పోషించాలని, నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావుతోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు అడుగులో అడుగు వేసి ముందుకు సాగాలని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సూచించారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అధ్యక్షతన సొంపల్లిలో జరిగిన మండల యూత్ కమిటీ సమావేశంలో పినపాక నియోజకవర్గ యూత్ సభ్యులు, మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు.
అభివద్ధి కాంతారావు తోనే సాధ్యం : గోనెల నాని
పినపాక నియోజకవర్గం అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్య మని బిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు గోనెల నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నస్కురి సందీప్ కుమార్ ను అధ్యక్షుడిగా, తోకల దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా నస్కురి అరవిందస్వామి, పండగ రఘువరన్ ఉపాధ్యక్షులుగా ఏక గ్రీవంగా గ్రామ మండల యువతతో పాటు మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, మండల నాయకులు ధనుగోరి శ్రీనివాసరావు, గాదె నర్సిరెడ్డి, వార్డ్ మెంబర్ సీతయ్య, ఎస్సీ టౌన్ కమిటీ అధ్యక్షులు పెంకే శ్రీను,ముఖ్య నాయకులు తొకల సతీష్, కోట రమేష్, మందా ప్రసాద్ మరియు యువ నాయకులు సుధాకర్, శమకురి సతీష్ పాల్గొన్నారు.