Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అన్ని గ్రామాలలో పోడు సర్వేలు
సమగ్రంగా చేయాలి
-రాజకీయ జోక్యం నివారించాలి
-పట్టణ సమస్యలపై నిర్లక్ష్యం తగదు
-మచ్చ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం
ఇప్పటి వరకు గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని, సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, భద్రాచలం పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం విడనాడాలని సిపిఎం భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం చందర్రావు భవన్ లో కారం పుల్లయ్య అధ్యక్షతన బుధవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయని, పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పోడు భూముల సర్వేల విషయంలో రాజకీయ జోక్యం నివారించాలని, అర్హత కలిగి అనేక సంవత్సరాలుగా సాగుదారులుగా ఉన్న గిరిజనులందరికీ పట్టాలు ఇచ్చే విధంగా సర్వేలు పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఈ సర్వే కమిటీలలో రెవిన్యూ తో పాటు ఫారెస్టు అధికారులు కూడా ఉండటం వలన సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రధానంగా భద్రాచలం కరకట్ట సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్ణయాలు చేస్తున్నారని, సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఆయన కోరారు. దీంతోపాటు పెన్షన్లు, దళిత బంధు విషయాలలో ప్రభుత్వం రాజకీయ జోక్యం వలన అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దబ్బకట్ల లక్ష్మయ్య, గడ్డం స్వామి, రేణుక, కుమ్మరి శ్రీను, సరియం రాజమ్మ, చిలకమ్మ, చంద్రయ్య, సున్నం గంగ, కారం నరేష్, జ్యోతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.