Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీసుకోవడానికి నిరాకరించిన అధికారులు
- ప్రతిపాదనలు పంపాం - డిఈఈ రామిరెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
విశ్రాంతి గది అంటేనే కనీస సౌకర్యాలైన విద్యుత్ సౌకర్యం, మరుగు దొడ్డి లాంటి సదుపాయాలతో ఏర్పాటు చేసుకునే చిన్న పాటి భవనం. కానీ ప్రభుత్వం చేపట్టే పనులు అన్నీ అసంపూర్తిగా ఉంటాయని చెప్పడానికి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాంగణంలో రోగులు, వారితో వచ్చిన సహాయకులు సేద తీరడానికి నిర్మించిన భవనాలు చక్కని ఉదాహరణ. గిరిజనాభివృద్ధి సంస్థ నిధులతో అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం,వినాయకపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణాల్లో రూ.10 లక్షల వ్యయంతో రెండు విశ్రాంతి గదులను నామినేటెడ్ పద్ధతిని నిర్మాణం చేపట్టారు. పనులు సైతం పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని సంబంధిత ఆసుపత్రి అధికారులకు అప్పగించాలని ఐటిడిఎ ఇంజనీరింగ్ అధికారులు యోచించినప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని కారణంగా వారు హైండోవర్ చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో వాటి ప్రారంభం, వినియోగం ప్రశ్నార్ధకంగా మారింది.
విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం - ఐటిడిఎ డి.ఈ.ఈ రామిరెడ్డి
విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం ప్రతిపాదనలు పంపాము. మంజూరైన వెంటనే పనులు చేపట్టి విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.