Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
- 80 లక్షలతో నిర్మించిన సబ్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-దమ్మపేట
దేశంలో తెలంగాణ రాష్ట్రమే అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేట మండల కేంద్రంతోపాటు ముష్టిబండ, గణేష్ పాడు, నాగుపలి, పట్వారీగూడెం గ్రామాల్లో మొత్తం 80లక్షలతో నూతనంగా నిర్మించిన ఏఎన్ఎం సబ్ సెంటర్లను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలినీ, పౌరులందరికీ ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలను అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వివిధ ఆరోగ్య పథకాలు కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరే ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ని, మనం ఎల్లప్పుడూ ఆయనకి తోడుగా నిలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం అంటే భయపడే పరిస్థితి ఉండేది ఎప్పుడైతే మన నాయకుడు కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి తెచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి ప్రతి వ్యవస్థలో మార్పు మొదలైందని అధ్బుతంగా అభివృద్ధిని సాధించుకున్నామన్నారు. ఈ రోజు దేశంలోనే మన రాష్ట్రం నంబర్ 1గా నిలిచిందని, మన రాష్ట్రం లో ఉన్న పథకాలు వేరే ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, ఎంపీపీ సోయం ప్రసాద్, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరారవు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, ఎంపిటిసి కూరం కమల రావు, రమాదేవి భాస్కర్ రావు, కేదేసి రాధ, ఉప సర్పంచ్ దారా యుగంధర్, మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు చామర్తి గోపి, పగడాల రాంబాబు, చిన్నంశెట్టి యుగంధర్, సత్యనారాయణ కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.