Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన లక్ష్మీనగరం గ్రామంలో గల గిరిజన బాలికల వసతి గృహాన్ని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన రాత్రిపూట విధులు నిర్వహించే సిబ్బంది రిజిస్టర్ పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి రాత్రిపూట విద్యార్థులకు అందించే ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. నేటి నుంచి జరిగే ఎన్. ఏ. వన్ పరీక్షల కోసం ప్రత్యేకత తరగతులు బోధించే ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారా లేదా అని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనసరి నాగమణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైనింగ్ హాలులోకి వెళ్లి ప్రతిరోజు అందించే మెనూ వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. 10 విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విధుల్లో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పమన్నారు. ఆయన వెంట డిడి రమాదేవి, ఏ టి డబ్ల్యూ ఒ నరసింహారావు, సి సి గణేష్ తదితరులు ఉన్నారు.