Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
మారుమూల గ్రామల్లో ప్రజలకు చట్టాల పైన అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం ఆధ్వర్యంలో బుధవారం చంద్రుగొండ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు జరిగింది. కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. పేదరికం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆసరాగ చేసుకొని కొంతమంది వారిని ఉద్యోగం మరియు ఉపాధి కల్పిస్తామని నమ్మించి శారీరకంగా, లైంగికంగ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగ ఉండాలని సూచించారు. గ్రామాలలో సరైన అవగాహన లేమి వలన బాల్యవివాహాలు, పుత్ర సంతానం కోసం ఆడపిల్లలను గర్భంలో ఉండగానే తీసివేయడం చాలా బాధాకరమని తెలిపారు. న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేదల కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆపన్న హస్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది విద్యార్థినులు వారి రక్షణకు సంబంధించిన ఇబ్బందులను న్యాయమూర్తిని విన్నవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ మెంబర్స్ మెండు రాజమల్లు, ఎండి సాదిక్ పాషా, చంద్రుగొండ ఎస్సై జి.విజయలక్ష్మి, ప్రభుత్వ పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం జి.మంజుశ్రీ, స్కూల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచ్ డి.బాబురావు, జడ్పిటిసి కె .వెంకటరెడ్డి ఎంపీటీసీ దారా బాబు, సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.