Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంక భూములకు నష్ట పరిహారం చెల్లించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
దరఖాస్తు చేసుకున్న పోడు సాగురదారులందరికీ సర్వే చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం స్థానిక శ్రామిక భవనంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ వలస ఆదివాసుల పోడు భూములను సర్వే చేసి పట్టాలివ్వాలన్నారు. ఆధార్ కార్డులు, ఓటు హక్కు ఉన్నప్పుడు గిరిజన చట్టాలు ఎందుకు వర్తించవన్నారు. ఫారెస్ట్ అధికారులు పోడు సాగుదారులపై దౌర్జన్యానికి పాల్పడకూడదని హెచ్చరించారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ (బూడిద) కారణంగా ముంపుకు గురైనా లంక భూములకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. రైతులకు బీటీపిఎస్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండు చేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతుం దన్నారు. పగిడేరు, సాంబాయిగూడెం, రామానుజవరం, దమ్మక్కపేట విపరీతమైన గాలి కాలుష్యం వలన ప్రజలు రోగాల భారీన పడుతున్నరన్నారు. వెంటనే గాలి కాలష్యాన్ని నియంత్రించాలన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా విడుదలయ్యే యాష్ వాటర్ (బూడిద నీరు) గోదావరిలో కలవడం కారణంగా నీరు కలుషితం కావడంతో జిల్లాలోనే గోదావరి పరివాహాక ప్రాంతాలు ప్రజలు కలుషిత నీరు త్రాగడం వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీరు,వాయు కాలుష్యాన్ని అరికట్టాలని భూములు కోల్పోయినా సాంబాయి గూడెం, చిక్కుడుగుంట, రదమ్మక్కపేట సుమారు 40 మంది రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కొడిశాల రాములు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, లెనిన్‌బాబు, కుంజా కృష్ణకుమారి, టివిఎంవి ప్రసాద్, ఉప్పుతల నర్సింహారావు, పిట్టల నాగమణి, తోట పద్మ, వైనాల నాగలక్ష్మి, మాచర్ల లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.