Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
- తొలిమెట్టు ఎందుకు ముందుకు సాగడం లేదు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయని, అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాల పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, తొలి మెట్టు కార్యక్రమం ఎందుకు ముందు సాగడం లేదని కలెక్టర్ అనుదీప్ అధికారులను అడిగి తెలసుకున్నారు. బుధవారం కలెక్టర్ మున్సిపల్ పరిధిలో పర్యటించారు. ముందుగా 11వ వార్డులో బస్తీ దవాఖానా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపాల్టీ పరిధిలోని 11, 6, 12, 35, 24, 33, 34 వార్డులలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. 11వ వార్డు చిట్టిరామవరంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గ్రామస్థులను సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రంగా తయారు చేసేందుకు మరమ్మత్తులు చేపట్టాలని వాల్ పెయింటింగ్స్ చేపించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణిలకు సీమంతం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించాలంటే నిరంతర వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించిన తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎందుకు నేర్పించలేకపోయారని, తనకు కారణాలు. చెప్పొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. 3వ తరగతి విద్యార్థినితో కూడికలు, తీసివేతలు చేపించి అభినందించారు. తొలిమెట్టు కార్యక్రమం ఉద్దేశ్యం ప్రతి విద్యార్థికి తప్పని సరిగా చదవడం, రాయడం రావాలని అది ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పారు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదని, 10 రోజుల్లో ప్రతి విద్యార్థి ప్రగతి సాధించు విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం రామచంద్ర కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో పార్కు ఏర్పాటుతో పాటు క్రీడలు కొరకు వాలీబాల్, బాస్కెట్‌బాల్, వాకింగ్ ట్రాక్, అవుట్ డోర్ షటిల్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పారు. 12వ వార్డులో నిర్మిస్తున్న వైకుంఠదామం నిర్మాణ పనులను పరిశీలించారు. వైకుంఠదామంలో మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్యాస్ దహన వాటికను పరిశీలించి ఏర్పాట్లును పూర్తి చేయాలని చెప్పారు. 24వ వార్డులో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 33, 34 వార్డులలో నిర్మిస్తున్న కూరగాయాలు, మాంసపు మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలపరిమితి ముగిసినప్పటికీ ఇంక ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, మున్సిపల్ కమీషనర్ నవీన్, పీఆర్ ఇఇ సుధాకర్, సీడిపిఓ లేనినా, తహసీల్దార్ రామకృష్ణ, టీపిఓ ప్రభాకర్, ఏఇలు రాము, సాహితీ, ఆయా వార్డుల కౌన్సిలర్స్ పాల్గొన్నారు.