Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యాప్తంగా అన్ని గనుల నుంచి యేటా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్
- అన్ని ప్రాంతాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రతీక్షణం అపమ్రత్తంగా ఉంటూనే రక్షణ చర్యలు చేపడుతూనే బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ అన్ని ప్రాంతాల జీఎంలకు సూచించారు. బుధవారం సీఎండీ శ్రీధర్ హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్షరెన్స్లో జీఎంలు, పీవోలు, ఇతర విభాగాల అధికారులతో మాట్లాడారు. కొత్తగూడెం జీఎం జక్కం రమేశ్ సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జేవీఆర్-ఓసీ, కిష్టారం ఓసీ ప్రాజెక్టు అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎండీ శ్రీధర్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇంకనూ మిగిలి ఉన్న ఉత్పత్తిని సాధించి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 22 నుంచి మార్చి 23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల నుంచి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సీఎండీ శ్రీధర్ నిర్దేశించారు. ఈ లెక్కన ప్రతిరోజే 2.20 లక్షల టన్నుల బొగ్గును తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గనుల నుంచి సాధించాల్సి ఉంటుందన్నారు. దీంతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ)ని 14లక్షల క్యూబిక్ మీటర్లు వరకు తొలగించాల్సి
ఉందన్నారు. ఈ సందర్భంగా ఓబీ పనులు, బొగ్గు రవాణా తదితరాంశాలపై సీఎండీ జీఎంలు, ఆయా ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 2:00 గంట వరకు జరిగింది. కార్యక్రమంలో జీఎం (ఎస్వోటూ) మిక్కిలినేని శ్రీరమేశ్, ఏరియా ఇంజినీరు రఘురామరెడ్డి, జేవీఆర్, కిష్టారం ఓసీల ప్రాజెక్టు ఆఫీసర్లు వెంకటాచారి, ఎంవీ నరసింహారావు, డీజీఎంలు సామ్యూల్ సుధాకర్, యోహాన్, ఆంజనేయశెట్టి, మేనేజర్ (ఐటీ) శేషశ్రీ, డీవైఎస్ఈ (సివిల్) మదీనాబాషా పాల్గొన్నారు.