Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర మహాసభ ఖమ్మం జిల్లాలో ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు వర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని మంచికంటి భవనంలో యూనియన్ నాయకులతో కలిసి మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో, కారు, ట్రాక్టర్, లారీ, డీసీఎం, జెసిబి, ప్రోక్లైన్, ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆర్టిసి డ్రైవర్లు, వర్కర్స్, షోరూం వర్కర్లు, మెకానికులు రవాణా రంగానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వివిధ రంగాల కార్మికులను ఐక్యం చేయడం కోసం అలాగే కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఫిట్నెస్ చార్జీలు తగ్గించడం కానీ లైసెన్స్ ఫీజులు రవాణా చార్జీలు తగ్గించడంలో సిఐటియు సంఘం కీలకపాత్ర పోషించిందని వారు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను జిఎస్టిలోకి తీసుకురావాలని అలాగే ట్రాన్స్పోర్ట్ రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మండలాల జిల్లాల ప్రతినిధులు హాజరై ఈ మహాసభను విజయవంతం చేసి భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయం చేసుకొని ఈ మహా సభను విజయవంతం చేయాలని, కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని కోరారు.
ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.విక్రమ్, సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్, ట్రాక్టర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ధరవ రాందాస్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అమరయ్య, జెసిబి యూనియన్ అధ్యక్షులు వెంకట్, కార్ యూనియన్ జిల్లా నాయకులు బొట్ల విద్యాసాగర్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు ఉపేందర్, కాసిం, అక్బర్, నరసయ్య, సంపత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.