Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ డాక్టర్ యలముడి కావ్యచంద్
- నిర్భయ, దిశ చట్టాలకు బడ్జెట్ కేటాయించి, పకడ్బందీగా అమలు చేయాలి
- విద్యావేత్త శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ నాగ ప్రవీణ
నవతెలంగాణ - ఖమ్మం కార్పోరేషన్
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రముఖ డాక్టర్ యలముడి కావ్యచంద్ అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పఠాన్ రోషిని ఖాన్ అధ్యక్షతన జరిగిన డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్ కమిటీ కన్వెన్షన్ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. ప్రజలు పోలీసులకు సహకరించడం ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలు అరికట్ట వచ్చు అని ట్రాఫిక్ సిఐ అశోక్ రెడ్డి అన్నారు. మహిళా చట్టాల అమలు కోసం ఉద్యమించాలి అని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ అన్నారు. ప్రముఖ విద్యావేత్త, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ నాగ ప్రవీణ మాట్లాడుతూ చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఆ చట్టాలకు బడ్జెట్ కేటాయించి వాటిని ఖర్చు చేయాలని ఆమె అన్నారు.ఈ సందర్భంగా యంగ్ వుమెన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కన్వీనర్‌గా పదముత్తు ఉష, కో కన్వీనర్లుగా మాడపాటి సుజాత, పటాన్ రోషిని ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా పోలేపల్లి చరణ్య, ఎండి మశ్రిన్, విజయలక్ష్మి, త్రివేణి, భార్గవి, జ్యోతి, ప్రమీల తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, మంగయ్య, బొడ్డు మధు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.