Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఓటు జీఎంకు వినతిపత్రం
నవతెలంగాణ-మణుగూరు
కొండాపురం భూగర్భగని ప్రభావిత గ్రామాలు అయినా బుగ్గ, ఖమ్మం తోగు, బుడుగుల రహదారులు ఏర్పాటు చేయాలని ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్‌కు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్‌రావు ప్రభావిత గ్రామస్తులు గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజలు మాట్లాడుతూ ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా రోడ్లు గుంతల మయంగా మారిందన్నారు. దీని కారణంగా ప్రయాణాలకు, స్కూల్, వైద్యం, నిత్యావసర కోసం ఇబ్బందిగా ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం చొరవచూపి ఖమ్మం తోగు వరకు రోడ్డు మరమ్మతులు నిర్వహించాలన్నారు. బుడుగుల వరకు కొత్త రోడ్డు వేసే ప్రతిపాదన చేయాలని ఆయన కోరారు. ఈ మూడు గ్రామాల్లో ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఓబి కంపెనీలలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో బుగ్గ ఉపసర్పంచ్ బండ్ల కృష్ణ, బి.ఆదినారాయణ, బి.చంద్రయ్య, ముస్కి రమేష్, దేవయ్య, గంగరాజు, లక్ష్మణ్, సోమయ్య, జోగయ్య, మాసయ్య, నగేష్, చీమల రమేష్, ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు.