Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు
- రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు
నవతెలంగాణ-చండ్రుగొండ
పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పోడు భూముల సాగు దారులను గుర్తించి పట్టాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అటవీ రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ శాఖల సమన్వయంతో పాటు గ్రామంలోని ఎఫ్ఆర్సి కమిటీ సభ్యుల సమన్వయంతో ఆర్ఓఎఫ్ఆర్ సర్వే చేయడం జరుగుతుందని, ఇదే అవకాశంగా భావించిన కొందరు అడవులను ప్లాంటేషన్లను రాత్రికి రాత్రే చెట్లను నరికి వేస్తున్నారని అలాంటి వారిపై అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని రేంజర్ శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది వ్యక్తులు 204 ఏసీ ఏ-డిఎఫ్డీ ప్లాంటేషన్లో సుమారు 1100 మొక్కలు నరికి వేయడం జరిగిందని వారిపై పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్టు, ప్లాంటేషన్ మొక్కలు నరికిన వారిపై కూడా ల్యాండ్ రికవరీ చట్ట ప్రకారం తగు చర్యలు, ప్రభుత్వ పథకాలు నిలిపి వేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. అడవులను ప్లాంటేషన్లను ధ్వంసం చేసేవారి వివరాలను అందించాలని అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.