Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న యాజమాన్యం
- మంద నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి యాజమాన్యం కార్మికునికి కేటాయించిన కంపెనీ క్వార్టర్‌ను హౌంగార్డు ఇల్లీగల్‌గా ఆక్రమిం చుకుని ఇంట్లో నివసిస్తున్నప్పటికీ యాజమాన్యం ఖాళీ చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపించారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం ఏరియాలోని రామవరం ప్రాంతంలోని సిఆర్పి క్యాంప్ నందు బికే-33/3 కంపెనీ క్వార్టర్‌ని పద్మావతి గనిలో పనిచేస్తున్న బొంకురు భార్గవ్ సర్వే మజ్దూర్‌కు కంపెనీ యాజమాన్యం అలాట్మెంట్ చేసింది. దీనికి సంబంధించి కార్మికు డికి లెటర్ అందజేశారు. కార్మికుడు ఆ లెటర్ తోని ఇల్లు చూసుకుందామని వెళ్తే ఆ ఇంట్లో హౌంగార్డు కట్ల ఉపేందర్ ఇల్లీగల్‌గా ఆక్రమించుకుని ఉంటు న్నాడని, దన్ని చూసి కార్మికుడు ఖంగుతిన్నాడని తెలిపారు. కార్మికుడు ఈ క్వార్టర్‌ను నాకు కేటాయించారని చెపాడు. నేను ఖాళీ చేయను..! ఏదైనా ఉంటే సింగరేణి యాజమాన్యంతో మాట్లాడుతాను.. అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. బాధ్యత రహితంగా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు...చోద్యం చూస్తున్నదని నరసింహారావు తెలిపారు. సింగరేణి కార్మికునికి కేటాయించిన క్వార్టర్‌ను ఇల్లీగల్‌గా ఆక్రమించుకుని ఉంటున్న హౌంగార్డ్ను వెంటనే ఖాళీ చేయించి, యాజమాన్యం కార్మికు నికి అప్పగించకపోతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియ న్ (సిఐటియు) ఆధ్వర్యంలో యాజమాన్యం చాతకాని తనాన్ని ఎండగడుతూ పెద్దఎతుతన ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.