Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పాల్వంచ
ఆశ్రమ పాఠశాలల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పరిస్థితి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలో ఆశ్రమ పాఠశాల ఎదురుగా గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్ల దినసరి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం వీరికి ఉద్యోగ భద్రత, భీమా కూడా కల్పించలేదన్నారు. వీరి సమస్య జిల్లా అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లి వీరికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మానుపురి ప్రభాకర్, మహిళ మోర్చ పట్టణ అధ్యక్షురాలు కొంగ ఉమ, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు సర్దార్ సురేష్, గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మాదారపు లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.