Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్ధేశించిన ఇంకుడు గుంటలను పూర్తి చేయాలి
- రహదారుల వెంట ఉన్న వ్యర్థాలను తొలగించాలి
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
రహదారుల వెంబడి వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రం చేపించాలని, ఉపాధి హామి పథకం పనులకు కూలీల హాజరు శాతం పెరగాలని, నిర్ధేశించిన ఇంకుడు గుంటలను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ అనుదీప్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పల్లె ప్రగతి కార్యక్రమాలపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల వెంబడి వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయాలని, వ్యర్ధాలు వేయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధాన రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని చెప్పారు. ఉపాధి హామి పథకం పనులకు పెద్ద ఎత్తున కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఉపాధి హామి పథకం పనులకు కూలీలు హాజరయ్యేందుకు టీఏలకు లక్ష్యాన్ని నిర్దేశించాలని చెప్పారు. పంట కల్లాలు నిర్మాణానికి మంజూరు చేసిన అడ్వాన్సు నిధులు తిరిగి చెల్లించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షణకు పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే క్షేత్రస్థాయిలో హాజరయ్యే విధంవగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు నిర్దేశించిన 10 వేల ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. 2015 కంటే ముందు ఆధార్ తీసుకున్న వారందరు తప్పని సరిగా అప్డేషన్ చేయించు విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు, ఉపాధి హామి పథకం కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ మెరుగు విద్యాలత, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, అన్ని మండలాలు ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.