Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనుల్లో యువత భాగస్వామ్యం కావాలి
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ యువజన కమిటీని ఎన్నుకున్నారు. సందర్భంగా జరిగిన సమావేశంకు మండల యువజన ప్రధాన కార్యదర్శి ఎడమకంటి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల అబ్జర్వర్ ఇన్చార్జ్ హర్ష నాయుడు, మండల యువజన విభాగం అధ్యక్షులు గోనెల నానిలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో యువత కీలకంగా మారి భాగస్వాములు కావాలని వారు అన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. అనంతరం రెడ్డిపాలెం కమిటీని ఎన్నుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షునిగా సానికొమ్ము రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అవినీడి రోహిత్ చౌదరి, కార్య దర్శిగా చెంచలపు శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా బాదావత్ శంకర్, బొంత కిషోర్, ముదిగొండ సాయి కిరణ్, ఉప్పరపల్లి మోహన్, దేపంగి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా బానోత్ విజరు, పోతి నేని చందు, కొండపల్లి రాకేష్, మద్దిబోయిన కార్తీక్, గోడేటిసుధాకర్లను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కంది కొండారెడ్డి , కాటంశ్రీనివాస్ రెడ్డి, సోము నవనీత్ రెడ్డి, తూర్పాక శ్యామ్, అడ్వైజరీ కమిటీగా ఎడమకంటి మణికంఠ రెడ్డి, బానోత్ భాస్కర్, దారా దినేష్‌లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ మండల అధ్యక్షుల బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కాటం వెంకటరామిరెడ్డి, యువ జన విభాగం వైస్ ప్రెసిడెంట్లు బోనం నాగి రెడ్డి, ఖాదర్ మండల యువనాయకులు సారెడ్డి అశోక్ రెడ్డి, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.