Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ నెల 21, 22 తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్న ఆహ్వాన సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి రవికుమార్ తెలిపారు. గురువారం యలమంచి సీతారామయ్య భవన్లో మర్మం చంద్రయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జరిగిన ఆహ్వాన సంఘం సమావేశంలో రవికుమార్‌తో పాటు వ్యకాస జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేపాకులు శ్రీనివాస్, మచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య మాట్లాడారు. ఉద్యమాల పురిటి గడ్డ అయిన మండల కేంద్రంలో ఈ నెల 21, 22వ తేదీలలో జరిగే వ్యకాస జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు. జిల్లా మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎంపి మిడియం బాబురావు, అధ్యక్షులుగా మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా మర్మం చంద్రయ్య, కోశాధికారిగా కారం పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా సీతారాంపురం ఎంపీటీసీ యలమంచి వంశీకృష్ణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సరియం రాజమ్మ, పూనెం కనకదుర్గ, మీడియ జయ, సోయం పార్వతితో పాటు నాయకులు కొడాలి లోకేష్‌బాబు, రాజేశ్వరి, బొల్లి సత్యనారాయణ, ఎండి బేగ్, సాంబశివరావు, ఎండి బేగ్, యలమంచి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.