Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
మున్సిపల్ చట్టాలపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ మణుగూరు మున్సిపల్ సిబ్బందికి విధులు, చట్టాలపై అవగాహన కల్పనకు ఏర్పాటు చేసిన చేసిన అవగాహన, శిక్షణా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుర ప్రజలకు సేవలు అందించుటలో సిబ్బంది సైనికలవలే పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అపుడే ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటుందన్నారు. ఇటీవల ప్రభుత్వం విఆర్ఓలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించినందున 38 మంది విఆర్ఓలు మున్సిపల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించినందున ప్రజలకు సేవలందించు అతి పెద్ద మున్సిపల్ వ్యవస్థలో మీరు భాగస్వాము లయ్యారని అభినందిస్తూ మీ సేవలు ఎంతో అమూల్యమైనవని చెప్పారు. మున్సిపల్ విధులు విధానాలు, మున్సిపల్ చట్టం ప్రాధాన్యతను కూలం కషంగా తెలుసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా మున్సి పాల్టీలలో అద్భుతమైన మార్పును సాధిస్తూ ప్రగతి పథంలో దూసుకు పోతతూ స్వచ్చ మున్సిపాల్టీల వైపు వడి వడిగా అడుగులు వేస్తున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సి పల్ కమిషనర్లు నవీన్, అంకుషావలి, శ్రీకాంత్, మాధవి, డిఈలు, ఏఈలు, సానిటరీ ఇన్పెక్టర్ల్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు..