Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతనంగా మరో నలుగురు చేరిక
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఎట్టకేలకు సాదారణ వైద్యుల కొరత తీరుతోంది. ఈ ఆసుపత్రిలో నిపుణులైన 12 మందితో కూడిన వైద్య బృందం సేవలు అందించాల్సి ఉంది. గత కొన్నేళ్ళుగా ప్రయివేటు బహు ప్రియం కావడంతో ప్రభుత్వ వైద్యంపై జనసామాన్యానికి మక్కువ పెరగడంతో ఈ ఆసుపత్రికి రోగులు తాకిడి పెరిగింది. ఈ క్రమంలో 2020లో కరోనా భూతం సమాజాన్ని అతలాకుతలం చేసిన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు అయ్యాయి. ఈ నేపద్యం ప్రభుత్వం ఆసుపత్రులను వైద్యులు కొరత తీవ్రంగా ఉంది. అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత కొన్నాళ్ళుగా ఇద్దరు వైద్యులు వెంకటేశ్వర్లు, అనుదీప్‌లు మాత్రమే సేవలు అందిస్తున్నారు. కొన్ని నెలలు క్రితం డాక్టర్ స్పందన చేరారు. ఇటీవల ఈ ఆసుపత్రికి వైద్యాధికారినిగా డిప్యూటీ డెంటల్ సర్జన్ డాక్టర్ జయలక్ష్మి విధుల్లో చేరారు. అనంతరం మంగళవారం మరో ఇద్దరు వైద్యులు అరుణ కాంత్, క్రిష్ణ కాంత్‌లు, గురువారం మరొక దంతవైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిక విధుల్లో చేరారు. దీంతో ఈ ఆసుపత్రికి సాదారణ వైద్యులు కొరత తీరినట్లు అయింది. వీరందిరికీ వైద్యాధికారిని జయలక్ష్మి విధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ ఊర్మిళ, పీహెచ్ఎన్ శ్యామల, ఫార్మాసిస్టు బి.వి క్రిష్ణ, ఎల్టీ జిలానీ, శానిటేషన్ సూపర్ వైజర్ సురేష్‌లు ఉన్నారు.