Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ దయానంద స్వామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనఖి నిర్వహించారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సత్యనారా యణపురం, దుమ్ముగూడెం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గర్భిణీ స్త్రీలకు నాలుగు వారాలు లోపే నమోదు చేయాలని, సీరియస్ లక్షణాలు ఉంటే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలన్నారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటట్లు చూడాలన్నారు. కోవిడ్ ప్రికాషన్ డోస్ అందరూ వేయించుకోవాలని తెలిపారు. సిబ్బింది అందరూ అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.