Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం డాక్రా రుణాలు రద్దుచేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కొత్తగూడెం పట్టణ కమిటీ సమావేశం స్థానిక ఐద్వా ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు రుణాలు రద్దు చేయాలని, వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని, ప్రతి గ్రూపుకు రూ.10 లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మాత్రం పేదలు రుణాలు తీసుకుంటే వాళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రం కోట్లది కోట్లు బ్యాంకులకు ఎగవేతల చేస్తుంటే ఈ ప్రభుత్వాలు వాళ్లను పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. పేదవాళ్లకు పనులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యం, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు పెంచడం వల్ల అనేక రకాలుగా ప్రజలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనుక ఇకనైనా ప్రభుత్వం స్పందించి డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని, లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి సందకూరు లక్ష్మి, నందిపాటి రజిత, అన్నవరపు పద్మ, సువర్ణ, నాగమణి, కళావతి, మీనా, జె.లక్ష్మి, శ్యామల, రమ పాల్గొన్నారు.