Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక వైద్యశాలను శుక్రవారం జాతీయ నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండ్ అప్(ఎన్ క్యూ ఆర్ఎస్) సభ్యుల బృందం ప్రధాన అధికారులు పరిశీలించారు. ఈ పరిశీలనకు వచ్చిన డాక్టర్ గురు ప్రశాంత్, భాగ్యవతి యతిష్ల బృందం సభ్యులకు స్థానిక జిల్లా వైద్య బృంద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ దయానంద స్వామి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం చండ్రుగొండ ప్రాథమిక వైద్యశాలకు నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండ్ప్ సర్టిఫికెట్ పొందిందని అన్నారు. ఎన్ క్యూ ఆర్ఎస్ సభ్యుల బృందం ప్రాథమిక వైద్య కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సుకృత, ఎన్సిబి అధికారి డాక్టర్ చేతన్, జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, జిల్లా మాత శిశుసంరక్షణ అధికారి డాక్టర్ సుజాత, స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్, పాలియటిక్యూర్ వైద్యాధికారి డాక్టర్ రూప, ఆర్బిఎస్కే ఏరియా అధికారి డాక్టర్ సుందర్, డాక్టర్ రాధాకృష్ణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.