Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కానింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు
- ఐద్వా సర్వే..సమస్యలపై సూపరిండెంట్‌కు వినతి
నవతెలంగాణ-భద్రాచలం
ఐద్వా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లోని సమస్యలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగు చూసినట్లు ఐద్వా మహిళా నేతలు పేర్కొన్నారు. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద హాస్పిటల్ భద్రాచలం ప్రభుత్వ ఏరియాహాస్పిటల్ అయినప్పటికీ అందులో 73 మంది డాక్టర్స్ ఉండాలి కానీ ప్రస్తుతం 19 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారని గుర్తించారు. అతిపెద్ద హాస్పటల్ అయినా డాక్టర్స్ మాత్రం 19 మంది ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మారుమూల ప్రాంతాల నుండి ప్రజలు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కి వస్తారు, కానీ డాక్టర్లల కొరత ఉండడంతో ప్రజలకు సరి అయిన వైద్యం అందరం లేదన్నారు. ముఖ్యంగా గైనకాలజీ లేడీ డాక్టర్స్ లేరని, గర్భిణీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు వస్తే ఏరియా హాస్పిటల్‌కు వెళితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొత్తగూడెం వెళ్ళండి లేదా ప్రయివేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళమని చెప్తున్నారన్నారు. గిరిజనులు, పేద ప్రజలు ప్రయివేటు హాస్పటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్లే భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కి వస్తున్నారన్నారు. డెలివరీ వార్డు దగ్గర కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. అలాగే ఫ్యాన్లు కూడా లేవు. వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. వెంటనే స్కానింగ్ సంబంధించిన డాక్టర్స్‌ని ఏర్పాటు చేయాలని సర్వేలో అక్కడ ప్రజలు, రోగులు శుక్రవారం భద్రాచలం 5వ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలన్నీ భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పటల్ సూపర్డెంట్ రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సూపర్డెంట్ రామకృష్ణ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, ఇద్దరు మహిళ డాక్టర్స్‌ను నియమించడం జరిగిందని అన్నారు. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ ఒక నెలరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తాం
ఈ సమస్యలన్నింటిని నెల రోజుల్లో పరిష్కరించకుంటే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ముస్తేల జ్యోతి, డి సీతాలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు నాదెళ్ల లీలావతిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఆఫీస్ బేరర్స్ జీవన్ జ్యోతి, సిహెచ్ రమణ, జి.రాధా, టౌన్ కమిటీ సభ్యులు కే.రమణ, ఎస్.కే చోటమ్మ, ఎం.నూక రత్నం, మంగతాయారు జానకమ్మ, కే.సుశీల, పి.జయ తదితరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.