Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
నవతెలంగాణ పాల్వంచ
వర్షాకాలంలో రైతుల నుండి ధాన్యం సేకరణకు పాల్వంచ సొసైటీ ద్వారా మండలంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, ధాన్యం కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మండలంలోని రెడ్డిగూడెం (ప్రభాత్ నగర్), కారేగట్టు, సోముల గూడెం, నాగారం, దంతెల బోరాలతో పాటు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పేట చెరువులలో 6 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నా మన్నారు. ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర క్వింటాలకు గ్రేడ్-ఎ రకానికి రూ.2060లు, సాధారణ రకానికి రూ.2040లుకు పెంచింద న్నారు.17తేమశాతం, కల్లాల వద్దె తూర్పారాబట్టి శుభ్రం చేసిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించను న్నారన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శంభో శంకర్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ మోహన్ రావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాం బాబు, యర్రంశెట్టి మధుసూదన్ రావు, సామా జనార్దన్ రెడ్డి, భూక్య కిషన్, నిమ్మల సువర్ణ,బర్ల వెంకటరమణ, సీఈఓ జి. లక్ష్మీనారాయణ,సురేందర్ రెడ్డి, ఏఈఓ సత్యం, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.