Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్టు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. మండలంలో 9వ రోజు అనునిత్యం ప్రజలకు కోసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని రిక్షా కాలనీ, మేడే కాలనీ, ఏరియాలలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు కోసం ప్రజలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే రేగా సహకారంతో పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మి చైతన్య రెడ్డి, ఉపాద్యక్షులు ఆంజనేయులు, ఐటీసీ సీనియర్ యూనియన్ నాయకులు దారుగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెహన్ రావు, ఐటీసీ బీఆర్ ఎస్కెవి ప్రధాన కార్యదర్శి సానికోమ్ము శంకర్ రెడ్డి, మండల కార్మిక విభాగం మర్రి సాంబిరెడ్డి, విరంరెడ్డి రామిరెడ్డి, సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉప అధ్యక్షుడు సట్టు అంజనేయులు, ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి, పార్టీ నాయకులు కనక చారి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, మండల మహిళా అధ్యక్షురాలు లలిత, రమాదేవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.