Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేదలు ఉపయోగించుకోవాలి
- త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి
నవతెలంగాణ-ఇల్లందు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం గైనకాలజీ విభాగంను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ గైనకాలజీ విభాగంను ప్రారంభించడం ద్వారా నిరుపేద గర్భిణులు గుండాల, ఆలపల్లి, ఇల్లందుకు దగ్గరలో ఉన్న ప్రాంతాల వారు కొత్తగూడెం వెళ్లకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అన్నారు. అంతేకాకుండా ఇక్కడ రేడియాలజిస్ట్, అనస్థేషియా, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ, డెంటల్, జనరల్ ఫిజీషియన్ వంటి 11 మంది వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. త్వరలో డయాలసిస్, బ్లడ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.