Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
పశువులు పట్ల రైతులు పలు జాగ్రత్తలు తీసుకొని, సకాలంలో టీకాలు వేయించి చర్మ వ్యాధులు నుండి కాపుడుకోవాలని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక అధికారి యం.వెంకటేశ్వర్లు రైతులకు చూసించారు. మండల పరిధిలోని రాజపురం గ్రామంలో గల పశువుల హాస్పటల్ని ఆయన శుక్రవారం సందర్శించారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన గొట్ సెడ్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పశువులకు చర్మ వ్యాధులు రాకుండా ముందుగానే జిల్లా వ్యాప్తంగా టీకాలు వేయడం జరుగుతుందన్నారు. పాడి రైతులు పశువులు కాపర్లు అందరూ పశువులకు చర్మం పై ఏదైనా మచ్చలు వస్తే వెంటనే గ్రామంలో పశువైద్య అధికారిని సంప్రదించి వైద్యం చేయించుకోవాలని అన్నారు. పాడి గేదెలను పెంచడం వలన రైతులకు పాల ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు వస్తాయని, గ్రామంలో ఎక్కువ మంది రైతులు పాడి గేదెలు పెంపకం చేయాలని చుసించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి రాంప్రసాద్, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.