Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన రక్షణ పరికరాలు ఇవ్వాలి
- సీఐటీయూ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మికులు తమ సామన్లను భద్రపరచుకోవడం కోసం ప్రతి కార్మికుడికి యాజమాన్యం టూల్ బాక్స్ ఏర్పాటు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి కార్మికుడు విధులకు వచ్చి, ఇంటికి వెళ్లే వరకు క్షేమంగా ఉండాలని, డ్రెస్ కోడ్‌తో, బైక్ పై హెల్మెట్ ధరించి రావాలని కార్మికులకు అవగాహన కల్పించడం కోసం యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది హర్షించదగినదే కానీ కార్మికుడు తను తీసుకొచ్చిన హెల్మెట్‌ను ఎక్కడ భద్రపరుచుకోవాలి అని కార్మికులు కార్మిక సంఘ నాయకులను, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కొందరు కార్మికులు హెల్మెట్ ధరించి రాకపోతే డ్యూటీకి తీసుకోమని యాజమాన్యం హెచ్చరిస్తుందని తెలిపారు. కొందరికి వార్నింగ్ లెటర్లు ఇవ్వడం ఇది సరైంది కాదని, కార్మిక నాయకులను నిలదీస్తున్నారన్నారు. కొందరు కార్మిక నేతలు మస్టర్లు పడి బయట ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే ఏమాత్రం శ్రద్ధ చూపని యాజమాన్యం తీరును ప్రశ్నిస్తున్నానరి తెలిపారు. కొందరి కార్మిక నేతలకు ఒక న్యాయం మరికొందరి కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. యాజమాన్యం కార్మికుల ప్రశ్నకు సూచికగా తక్షణమే కార్మికులు హెల్మెట్, తమ వస్తువులను భద్ర పరచుకోవడానికి ప్రతి కార్మికుడికి టూల్ బాక్స్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు. కార్మికులను హెల్మెట్ ధరించి రావాలని కార్మికులకు మరింత అవగాహన పెంచాలి కానీ యాజమాన్యం ఇది షాక్కుగా చూపి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయొద్దని ఆయన పేర్కొన్నారు. కార్మికుల రక్షణకు సంబంధించిన టోపీ, బూట్లు నాణ్యమైనవి ఇవ్వాలని, డ్యూటీ బట్టల స్టిచ్చింగ్ చార్జెస్ రెండు జాతులకు కలిపి కేవలం రూ.450లు మాత్రమే ఇస్తున్నారని దీనిని ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం పెంచి ఇవ్వాలని, వీటి మీద యాజమాన్యం శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.