Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్
నవతెలంగాణ-దమ్మపేట
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల హమాలీ పనులలో ఐదు లక్షల మంది హమాలీ కార్మికులు పని చేస్తున్నారని, వీరందరికీ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం దమ్మపేటలో సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా మొదటి మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. హమాలిలు అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్రమాద వశాత్తూ గాయపడినా, మరణించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అందించాల్సిన నిత్యావసర వస్తువులను చేరవేయడంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పీఎం నరేంద్ర మోడీ ఏ కార్మికుడికైనా రోజుకి రూ.175 కనీస వేతనంగా సరిపోతాయని మాట్లాడుతున్నారని ఆ రూ.175లతో ఎలా బతకడం సాద్యమవుతుందో మోడీ చెప్పాలన్నారు.
ఈ మహాసభ జిల్లా నాయకులు కొప్పుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. మహాసభలో సీఐటీయూ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ ఎగురవేశారు. అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మహాసభలో రైతు సంఘం జిల్లా నాయకులు మొరంపుడి శ్రీనివాసరావు మాట్లాడారు. మహాసభలో ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు నకిరీకంటి నాగరాజు, రాం బాబు, సోమిరెడ్డి, సంతోష్, ఎస్కే.బాబా, హనుమంతరావు, శ్రీనివాసరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పత్యామ్నాయ విధానాలను కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలలో ఉన్న డొల్లతనాన్ని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడాన్ని కార్మికుల్లో ఎండ గట్టి, ప్రత్యామ్నాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రస్తుత పాలక ప్రభుత్వాలు అధికారం కోసం ఎన్ని అడ్డ దారులైనా తొక్కుతున్నారని, రాజకీయాలంటే సేవలా కాకుండా, అదొక వ్యాపారంలా చేస్తున్నారు. ఈ రాజకీయా ల్లో కొట్టుకుపోకుండా, ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలి.