Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
రాయపట్నం గ్రామపంచాయతీలో అభివృద్ధి జానెడుగా ఉందని, అధికారుల అవినీతి మాత్రం బారెడుగా ఉందని సిపిఎం రాయపట్నం గ్రామ శాఖ కార్యదర్శి చేగొండి వీరయ్య విమర్శించారు. ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆయన వివరించారు. రాయపట్నం గ్రామంలో ఖర్చు చేసిన నిధులు, జరిగిన అభివృద్ధి పనులు పరిశీలించిగా అధికారుల నిర్వాకం అర్థమవుతోందన్నారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కోసం సుమారుగా కోటి రూపాయలు ఖర్చు చేయగా 2వేల మీటర్లు పూర్తి కావాల్సింది కేవలం 700 నుండి 800 మీటర్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అవి కూడా చాలా నాసిరకంగా రోడ్లు వేసి మూడు నెలల్లోని పగుళ్లు సంభవించాయన్నారు., సిసి రోడ్లు పూర్తిగా నిర్మించకుండానే బిల్లులు చెల్లించారన్నారు. రాయపట్నం గ్రామపంచాయతీ నిధులు అభివృద్ధి కోసం కాకుండా అవినీతి అధికారుల జేబులు నింపడం కోసం ఉపయోగపడుతున్నాయని చేగొండి వీరయ్య అన్నారు. అవినీతిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాయపట్నం గ్రామ ప్రజల సహకారంతో ప్రత్యక్ష ఆందోళన చేస్తామని అన్నారు.