Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యాలు
- రైతు వేదికలతో రైతులకు ఒరిగిందేమిటి
నవతెలంగాణ - ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరిని ఒకే వేదికపైకి తేవాలనే లక్ష్యంతో ప్రతి ష్టాత్మకంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు నేడు ఎక్కడ చూసినా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70% పై బడి రైతు వేదికల పరిస్థితి ఈ రీతి గానే కని పిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 2,604 రైతు వేదికలకు 573 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. జనగాం జిల్లా కొనకండ్లలో నిర్మించిన తొలి రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ 2020 అక్టోబర్ 31వ తేదీన ప్రారంభించారు. ఎర్రు పాలెం మండలంలో 31 గ్రామ పంచాయతీలకు గాను 7 క్లస్టర్లగా విభజించి ఏడు రైతు వేదికలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా, ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపిం చడం లేదని రైతులు ప్రశ్నిస్తు న్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో అతి వర్షాలు కురవడం వలన పంటలు సరైన దిగుబడి రాక పోవడం, వరి, పత్తి, మిరప తోటలకు తెగుళ్లు ఆశించడం వాటి నివారణకు రైతులందరిని రైతు వేదికలలో సమావేశ పరిచి రైతులకు తగు సూచనలు సలహాలు అందించ వలసిన వ్యవసాయ శాఖ అధికారులు అటువంటి ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. రైతు సమావేశాలు నిర్వహించవలసిన రైతు వేదికలలో రాజకీయ పార్టీ మీటింగులు, రైతు సంబరాలు, ముగ్గుల పోటీలు, ఫంక్షన్లకు తప్ప రైతులకు పంటలపై అవగాహన కల్పించడం లేదని రైతులే ఆరోపిస్తున్నారు. వ్యవసాయ సాగులో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఉ పయోగించ వలసిన రైతు వేదికలు ఖాళీగా కనిపిస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా వీటి నిర్మాణం వలన కాంట్రాక్టర్లు లాభ పడ్డారు తప్ప రైతులకు మాత్రం ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నది వాస్తవం. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతు సమావేశాలు జరిగే లాగా రైతు వేదికలను ఉపయోగంలోకి తేవాలని రైతులు కోరుకుంటున్నారు.