Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ హనోక్
నవతెలంగాణ-పెనుబల్లి
విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పరచుకోనిముందుకు సాగాలని సీఐ హనోక్ అన్నారు. చలమాల గిరీష్ చంద్ర స్మారక ప్రధాన బహుమతుల పురస్కారాలు శనివారం ప్రభుత్వ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా విద్యా సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదాానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య, వియం బంజర సీఐ హనోక్ కళాశాల ఆవరణలో మొక్కను నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును లక్ష్యాన్ని గీటురాయిగా ఎంచుకొని ఏ రంగంలోనైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగలన్నారు. బహుమతులు పొందిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ రాబోయే విద్యార్థులు కూడా ఇలాంటి ఎన్నో సత్కారాలను పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు అనిత, లయన్స్ క్లబ్ యూత్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చలమాల నరసింహారావు, సీపీఐ(ఎం) నాయకులు నల్లమల అరుణ్ ప్రతాప్, విద్యార్థి నాయకులు బెజవాడ సాయి శేషు, ఉపాధ్యాయులు అరవింద్, మల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.