Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
- జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శ్రీనివాస విద్యా నికేతన్ పాఠశాల బస్సు శుక్రవారం సాయంత్రం విద్యార్థికి ఢకొీన్న ఘటనలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాశం వెంకట్రామి రెడ్డి, రుచిత దంపతుల కుమారుడు షణ్ముఖ్ రెడ్డి మరణించిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల నుండి బస్సు దిగి తిరిగి ఇంటికి వెళ్తుండగా విద్యార్థికి బస్సు ఢకొన్నదని, పాఠశాల యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆయన అన్నారు. స్కూల్ బస్సు నిబంధనల ప్రకారం తప్ప కుండా బస్సులో క్లీనర్ ఉండాలని, బస్సు ఫిట్ నెస్ ఉండాలి కానీ ఇవేవీ లేకుండానే పై అధికారులకు ముడుపులు చెల్లిస్తూ నిబంధనలం తుంగలో తొక్కి యధేచ్చగా బస్సులు నడుపుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి పాఠశాల గుర్తింపు రద్దు చేసి, యాజ మాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదం డ్రులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎక్స్ గ్రేషియా విద్యార్థి కుటుంబానికి చెల్లించాలని ఆయన కోరారు. పాఠశాలకు అనుమతులు పొందేం దుకు తప్పుడు పత్రాలు సమర్పించి వక్ర మార్గంలో అనుమతులు పొందారన్నారు. పాఠశాలపై దీనిపై సమగ్ర విచారణ చేపట్టా లని ఆయన కోరారు. ఈ సందర్భంగా విచారణ అధికారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్,డివిజన్ నాయకులు రాము తదితరులు పాల్గొన్నారు.