Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ఆరోగ్యకర సమాజం కోసం వ్యాక్సిన్ ఎంతైనా అవసరమని ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ సమావేశం ఎంపీపీ బిరవల్లి రఘు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 7 నుండి 19 వరకు జరిగే టిడి (ధనుర్వాతం, మరియు డిఫ్తీరియా ) వాక్సినేషన్ కార్యక్రమానికి అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరారు. వైద్యులు డా.సురేష్, డా.లావణ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాఠశాలలో 5వ, మరియు 10 తరగతి చదువుతున్న పిల్లలకు ధనుర్వాతము మరియు డిఫ్తేరియా ఈ రెండు రకాల వ్యాధులు రాకుండా ఉండుటకు గాను ఒకే సూదిమందు ఇవ్వనున్నట్లు, తెలిపారు. స్కూల్ మానేసిన పైన తెలిపిన వయస్సు వున్న పిల్లలను కూడా గుర్తించి వారికీ కూడా ఈ టీకాలు వేయుటకు ప్రణాళిక తయారుచేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జిప్రసాద్, యంపిడిఒ మహాలక్ష్మి, సమాజ ఆరోగ్య అధికారి జె. రేవతి, విద్యాశాఖ నుండి వంగా రామారావు పాల్గొన్నారు.