Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు అందుబాటులో ప్రజా వైద్యం జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
నవ తెలంగాణ-బూర్గంపాడు
రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుం దని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. శనివారం బూర్గంపాడు సివిల్ ఆస్పత్రిని జెడ్పిటిసితో పాటు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పొడియం ముత్యాలమ్మలు సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య విద్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నదని ఆమె తెలిపారు. బూర్గంపాడు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా నలుగురు డాక్టర్లను ప్రభుత్వంతో మాట్లాడి కేటాయించినందుకు ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతా రావుకు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్య వాదాలు ఆమె తెలిపారు. 24 గంటలు వైద్య సేవలు, అదేవిధంగా జనరల్ ఫిజియేథెరఫి, షుగర్ డాక్టర్, దంత వైద్యుడు, ప్రస్తుతం అందు బాటులో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఆస్పత్రి కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండలం ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, యూత్ అధ్యక్షులు గోనెల నాని, బూర్గంపాడు టౌన్ అధ్యక్షులు సోహెల్ పాషా, మాజీ జెడ్పిటిసి భూపల్గి నరసిం హారావు, మండల మైనారిటీ అధ్యక్షులు సాదిక్ పాషా, సొసైటీ డైరెక్టర్ బొల్లురవి, వార్డ్ మెంబర్ సౌకత్ అలీ, తోకలు సతీష్ యువజన నాయకులు కన్నపల్లి సతీష్, శకామురి సతీష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.