Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఆర్ఐలు రూ.3.62 లక్షల విలువ గల కంప్యూటర్లు ఇవ్వడం అభినందనీయం
- ల్యాబ్ ప్రారంభ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ సులోచన రాణి
నవతెలంగాణ-ఇల్లందు
ఆధునిక సాంకేతిక విద్యా పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని నోడల్ ఆఫీసర్ (డీఐఈఓ) సులోచన రాణి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునికరించిన కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో కంప్యూటర్ విద్యా పరిజ్ఞానం ద్వారా ఆధునిక సాంకేతిక విద్యా పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవడానికి కంప్యూటర్స్‌ను ఉపయోగించుకోవాలన్నారు. కంప్యూటరు ప్రోగ్రామింగుపై ఎక్కువగా విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలని కంప్యూటరు విద్య సాఫ్టువేర్ ఇండిస్టీకి ఉపయోగపడే ఉద్యోగులను తయారు చేయడంపైననే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది కావున సాఫ్టువేర్ కంప్యూటరు సిలబస్‌లో గొప్ప సూత్రాలు, టెక్నికల్ సింపోసియం ఆన్ కంప్యూటరు సైన్సు ఎడుకేషన్, కంప్యూటరు ప్రక్రియ కంప్యూటరులను వాడటానికి కావాలసిన ప్రామాణిక పద్ధతులను ద్వారా విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రామలింగేశ్వర మాట్లాడుతూ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆధునికీకరణ చేపట్టడానికి గాను ఎన్ఆర్ఐలు అయిన డాక్టర్ గోవింద్, డాక్టర్ హరీష్ 1990 ఎస్ఎస్సీ, సెంట్ జోసెఫ్ స్కూల్ ఖమ్మం బ్యాచ్ సహకారం అందించారని అన్నారు. ఇల్లందు పరిసర ప్రాంత విద్యార్థుల కోసం కంప్యూటర్ విద్యను అందించాలని ఉద్దేశంతో రూ.3,62,477 అందించి ఈ కంప్యూటర్ ల్యాబ్ ఆధునికరణకు సహకరించినటువంటి వారికి పేద విద్యార్థినీ, విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయ సహకారాలు స్టాప్, విద్యార్థులు మర్చిపోరని విద్యార్థులు ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటారని తెలిపారు. అనంతరం 14వ వార్డ్ కౌన్సిలర్ రజిత, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్ కుమారి, సాహితీ కళాశాల కరస్పాండెంట్ నాగిరెడ్డి, మార్గదర్శి స్కూల్ కరస్పాండెంట్ అర్వపల్లి రాధాకృష్ణ, మైనార్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ప్రసంగించారు.
అనంతరం కళాశాలలో స్టేట్ ర్యాంకు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు డీఐఈఓ సులోచన రాణి, ఇదే కళాశాలలో రిటైర్డ్ అయిన ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, మార్గదర్శిని హై స్కూల్ ప్రిన్సిపాల్ అరపల్లి రాధాకృష్ణ తదితరులు ఆర్థిక సహాయం అందిందించి అభినందించారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన సాహితి కళాశాల ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, జూనియర్ లెక్చర జగన్, మరి కొందరికి శాలువాలు కప్పి బొకెన్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.