Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
మతోన్మాదం, కులతత్వం నుంచి ప్రజలను కాపాడటమే కామ్రేడ్ బత్తుల బిష్మారావుకిచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ.నర్సారెడ్డి అన్నారు. శనివారం స్థానిక బండారు చంద్ర రావు భవన్ నందు జరిగిన కామ్రేడ్ భీష్మారావు 37 వర్ధంతి సభలో చిత్రపటానికి సీనియర్ నాయకులు ఎంవిఎస్ నారాయణ పూలమాలవేసి నివాళులర్పించినారు. ఈ కార్యక్రమం జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఎంబి నర్సారెడ్డి మాట్లాడారు. 1985 నవంబర్ 5వ తారీఖున ప్రజా సమస్యల పరిష్కారం కోసం వి.ఆర్.పురం మండలంలోని జీడి గుప్ప గ్రామానికి సీపీఐ(ఎం) నాయకులందరూ కలసి వెళుచుండగా దారికాసిన మావోయిస్టులు వారిని అడ్డగించి అత్యంత కిరాతకంగా దాడి చేసారని, అందులో గాయపడిన బండారు చందర్రావు హాస్పటల్లో చికిత్స పొందుతూ డిసెంబర్లో మరణించినారన్నారు. హత్యలతో ఉద్యమాలు ఆగవని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద పోకడలతో కులతత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదన్నారు. ఈ విధానాలను ఎండగట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని ఆయన కోరినారు.పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, ఎన్.లీలావతి, శ్యామల భాస్కర్ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు డి.లక్ష్మి, యు.జ్యోతి, నాగరాజు, జి.లక్ష్మణ్, కోరాడ శ్రీను, చేగొంటి శ్రీను, కుంజ శ్రీను, ఫిరోజ్ శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.