Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌హెచ్‌జీ నుండి రూ.14 లక్షలు వసూలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
స్థానిక సెర్ప్ కార్యాలయంలో దీర్ఘకాలికంగా బ్యాంకులకు చెల్లించాల్సిన ఋణ బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘాలకు యూబీఐ (ఆంధ్రాబ్యాంక్) విజ్ఞప్తి మేరకు శనివారం ఏక కాల ఆర్ధిక పరిష్కారం(ఒన్ టైం సెటిల్మెంట్) శిబిరం నిర్వహించారు. కార్యాలయంలో యూనియన్ బ్యాంకు ఇండియా మేనేజర్ నరేష్, డీఆర్డీఓ అదనపు పీడీ నీలేష్, డీపీఎం రామాకాంతా, ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి, సీసీల సమక్షంలో స్వయం సహాయ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ధీర్ఘకాలికంగా రుణాలు చెల్లించకుండా ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు) కిందకు వచ్చిన 49 గ్రూపుల్లో 43 గ్రూపులకు ఎన్పీఏ విముక్తి లభించేందుకు తీసుకున్న రూ.2.24 కోట్ల రుణంలో రూ.14 లక్షలు చెల్లించారు. 20 సంఘాలు పూర్తిగా, 14 సంఘాలు పాక్షికంగా సొమ్ములు చెల్లించాయి. మిగిలిన సొమ్ములు రెండు రోజుల్లో చెల్లించేందుకు గడువు ఇచ్చారు.