Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
విద్యార్థినీలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అండ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జె.ముఖేష్ అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు, జిల్లా కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ ఒకటి నుంచి 13 వరకు న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం కరెంట్ ఆఫీస్ ఏరియాలో గల జూనియర్, డిగ్రీ విద్యార్థిని హాస్టల్లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఇల్లందు బార్ ప్రెసిడెంటు టి.మహేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు దంతాల ఆనంద్, జూనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు, కీర్తి కార్తిక్ వివిధ చట్టాలపై ప్రసంగించినారు. మండల న్యాయ సేవ సమితి మల్లయ్య హాస్టల్ వార్డెన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.