Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
భారతీయ జనతా పార్టీ విధానాలు అమలు చేసే ప్రధాని మోడీ పాలనతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని, ఈ కారణంగానే సీపీఐ(ఎం) లౌకిక విధా నాలు అవలంబించే పార్టీలతో సఖ్యత సాగిస్తుంది అని జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య తెలిపారు. శనివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యుడు పిట్టల అర్జున్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజక వర్గం ఏజీఓ, అశ్వారావుపేట మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో భవిష్యత్తులో రాజకీయాలు సమూ లంగా మారుతాయని, పార్టీలు నాయకులు సమీకరణలో దృష్టి సారిస్తాయని అన్నారు. ఈ ఎన్నిక బీజేపీ కుతంత్రాలతో వచ్చిందే తప్పా ప్రజలకు ఒరిగేదేమిటి అని ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగ బద్దంగా రూపొందిన ప్రభుత్వాలను ఆర్ధిక కుట్రలతో కూల్చడం బీజేపీకి పరి పాటిగా మారిందని, దీనికి ఉదాహారణ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపుతూ పట్టుబడిన సంఘటనే అని అన్నారు. మోడీ అండతో అదానీ ప్రపంచ కుబేరుల స్థానం దక్కించుకున్నాడని అన్నారు. స్థానిక సమస్యలు గుర్తించడం, బాధితులను సమీకరించడం, ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారానే వామపక్ష పార్టీలు బలపడతాయి, ఆ నేపథ్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ, అశ్వారావుపేట, దమ్మపేట మండల కార్యదర్శులు చిరంజీవి, మోరంపుడి శ్రీనివాస్, నిమ్మల మధు, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, జగన్నాధం, తగరం నిర్మల, కలపాల భద్రం, వీరభద్రం, మురళీ తదితరులు పాల్గొన్నారు.