Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సాపురం వైద్యాధికారి చైతన్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
విద్యార్థులకు అందించే టీడీ వ్యాక్సినేషన్‌పై వైద్య సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని నర్సాపురం వైద్యాధికారి చైతన్య అన్నారు. శనివారం నర్సాపురం వైద్యశాలలు టీడీ వ్యాక్సిన్ పై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 7 వ తేది నుండి 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న 5 నుంచి 10వ తరగతి చెందిన విద్యార్థులకు విధిగా వ్యాక్సినేషన్ అందించాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో 12 వారాల లోపు గర్భిణీల పేర్లు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వీలు రాంబాబు, రమణమ్మ, హెల్త్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ బాబురావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.