Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రవేశపెట్టినా మన ఊరు మన బడి పథకం ద్వారా విడుదల అయినా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. నిర్మాణాలు నాసిరకంగా ఉంటున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కమీషన్లకే పరిమితం అవుతున్నారు. ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కమీషన్లలో వాటా ఉంటుంది. మండలంలో 16 పాఠశాలలకు పాఠశాల భవనాలు, మూత్రశాలలు, వంటగదుల కోసం రూ.రెండు కోట్ల పదమూడు లక్షల యాభైవేల ఎనిమిది వందల నిధులను కేటాయించింది. ఇప్పటివరకు రూ.ఒక కోటి ఇరవైఏడు లక్షల డెబ్బైవేలు మాత్రమే విడుదల అయ్యాయి. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఐదు పాఠశాలలో పనులను ప్రారంభించలేదు. ప్రారంభించిన పాఠశాలలో ప్రభుత్వం రూపొందించిన విధానాలు కాకుండా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నాసిరకం సిమెంట్, ఇటుకలు వాడుతున్నారు. స్థానికులు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పినాసరే అధికార పార్టీ అండదండలు ఉన్నాయంటూ కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మండల వ్యాప్తంగా ఒకే కాంట్రాక్టర్ ఈ నిర్మాణాల పనులను చేపడుతున్నారు. శేషగిరినగర్ పాఠశాలలో నిర్మాణపనులు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడే మొదలు పెట్టినప్పడికి ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్ధులు చెట్ల కిందనే భోధన నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరాలు అధిక వర్షాలు పడడంతో విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. మండలంలోని అన్ని పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది. ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పందించడం లేదు. ప్రభుత్వ లక్ష్యాలను నీరు కార్చకుండా శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.