Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్
నవతెలంగాణ-ఇల్లందు
దేశ భవిష్యత్తు నేటి బాలల పైనే ఆధారపడి ఉందని వారే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ అన్నారు. స్థానిక జేబీఎస్ పాఠశాలలో గురువారం న్యాయ సేవా దినోత్సవ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాల్యంలో అలవర్చుకున్న సుగుణాలే సాధారణంగా జీవితాంతం ఒక మనిషి ఔన్నత్యాన్ని ఇముడింపజేస్తాయన్నారు. విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని అన్నారు. చిన్నతనం నుండే మంచి అలవాట్లను అలవర్చుకొని ఉన్నత విద్యలను అభ్యసించాలని అన్నారు. అదేవిధంగా చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దంతాల ఆనంద్, బాలకృష్ణ, ప్రభాకర్, రవి, ఉమామహేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.